4, జనవరి 2010, సోమవారం

రేపు మా నాన్నగారి జన్మదినం



రేపు అనగా జనవరి 5న మా నాన్నగారి 76వ జన్మదినం. ఆయనకు నా బ్లాగుద్వారా ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం నాకీ అవకాశం కలిగించిన బ్లాగర్స్ కు ధన్యవాదాలు.
మా నాన్నగారిది కేరళ రాష్ట్రంలోని కన్ననూరు జిల్లా తలిచేరి. ఆయన తన 14వ ఏటే ఇల్లు వదిలి వచ్చేసారు. రకరకాల మనుషులతో కలిసిన తరువాత తన 17వ ఏడు కోయంబత్తూరులో స్వామి సచ్చిదానంద అనే ఒక యోగిని కలిసి తాను సత్యాన్వేషణలో కాలినడకన దేశాటన చేసారు. చివరిగా మా వూరు చేరుకున్నాక ఇక్కడ ఉన్న పురాతన శివాలయం వద్ద స్థిరపడ్డారు. ఆ తదుపరి తన 31వ ఏడునాడు గృహస్తాశ్రమ ధర్మాన్ని ఆచరించవలసినదిగా గురువుగారు చెప్పియున్నదాని ప్రకారం మా అమ్మను వివాహం చేసుకున్నారు. మరల తనకు 50సం.లు పూర్తయినాక వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాలని తిరిగి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటినుండి ఇలా తన జీవన గమ్యాన్ని తన గురువు నిర్థేశకత్వంలో ఆచరిస్తున్నారు. తన సమాధి మందిరాన్ని ముందుగానే నిర్మించుకొని దానిపైనే దత్తాత్రేయ పీఠాన్ని స్థాపించి అక్కడే నివాసముంటున్నారు. విగ్రహారధనకు వ్యతిరేకి. రాజయోగ సాధన ద్వారానే మోక్షప్రాప్తి అని చెపారు. ఇప్పటికీ ఆయన తన వంశపారంపర్యంగా వస్తున్న ఆయుర్వేద వైద్యాన్ని తన జీవనాధారంగా ఆచరిస్తారు.మళయాళి అయినా తెలుగు నేర్చుకొని వైద్యంలో డిప్లొమా చేసారు. ప్రచారానికి ఇష్టపడరు. తనను తెలుసుకొని వచ్చిన వారికి మాత్రమే చెప్తారు. ఇలా తన జీవనవిధానం ఇప్పటికీ ఎప్పటికీ స్వతంత్రంగానే కొనసాగుతోంది.

ఆయన తన విధానాన్ని మాపై ఎప్పుడూ రుద్దడానికి ప్రయత్నించలేదు. నేను నా వామపక్షభావాలతో తనతో ఎంత వాదించినా తాను కొన్ని మూఢనమ్మకాలపట్ల, మత చాందసవాదం పట్ల నాతో ఏకీభవిస్తారు. నా ఆలోచనలకు తను అడ్డుచెప్పలేదు.

మరువం ఉషగారు వేసిన కొన్ని ప్రశ్నలకు నా సమాధానాన్ని మరల ఇక్కడ పొందుపరిస్తే కొంత మేరకు ఆయనపై అవగాహన ఉంటుందన్న సూచనతో...

ఆయన బాధ్యతలనుండి పూర్తిగా తప్పుకోలేదు. వానప్రస్థాశ్రమంలో గడుపుతున్నా తన వైద్య వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని మా కుటుంబ పోషణ కోసం మా అమ్మ గారి ద్వారా నిర్వహిస్తున్నారు. వైద్యం కూడా తన వద్దకు తెలిసి వచ్చిన వారికే చేస్తారు. నామ మాత్రపు మందులు ఖర్చు మేర తీసుకుని చేస్తారు. కుటుంబం పెద్దదైనా ఆయన విధానాలకు అలవాతుపద్దవారం కాబట్టి మావరకు ఫర్వాలేకుండా గడిపేసాం. మొదటినుండి తను స్వశక్తితోనే జీవించడం అలవాటుపడ్డ మనిషి. . అందరికి అనుమానమే. ఈ మనిషి కుటుంబం ఇట్లా ఎలా జీవిస్తో౦దో అని. . ఆయన ఇప్పటికి ఎవరికీ తలవంచని మనిషిగానే జీవిస్తున్నారు. తన మార్గానికి ఆట౦క౦ లేకు౦డా గడిచిపోతు౦ది. అది ఆయనకు ఆయనే సాధి౦చుకున్నారు. మనో జయ ఏవ మహా జయా: అనే చెప్తారు. ఆయనో self styled free monk.

మాకు ఈ జీవితాన్నిచ్చిన ఆయనకు సదా కృతజ్నుడ్ని. ఆయనకు మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.

11 కామెంట్‌లు:

  1. ఒక యోగి పుంగవుని జన్మదినాన వారికి మాప్రణామాలు అర్పిస్తున్నాము. మానమస్కారాలు వారికి అందజేయగలరు.

    లోక కల్యాణం కోసం భగవంతుడు సృష్టించిన యోగులజీవిత లక్ష్యం నెరవేర్చాలని పరమాత్మను వేడుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  2. వర్మ గారూ 1
    అంతటి మహానుభావునికి కుమారునిగా జన్మించిన మీరు అదృష్టవంతులు. మీ నాన్నగారికి మీ ద్వారా శుభాకాంక్షలు, నమస్కారాలు.

    రిప్లయితొలగించండి
  3. దుర్గేశ్వర గారు తప్పక చెబుతాను. థాంక్యూ..

    SRRao గారు నిజంగా అదృష్టవంతుడినే. తప్పక మీ శుభాకాంక్షలు అందజేస్తాను.థాంక్యూ సార్.

    రిప్లయితొలగించండి
  4. మీ నాన్నగారికి మీ ద్వారా శుభాకాంక్షలు, నమస్కారాలు.

    రిప్లయితొలగించండి
  5. మహానుభావులకు వందనాలు.మీరెంతో అదృష్టవంతులు.

    రిప్లయితొలగించండి
  6. varma gaaru,
    nenu lekhini lo compose chesi ikkada post chestumte teesukovadam ledu. komchem choostaara?

    రిప్లయితొలగించండి
  7. వర్మ గారూ,
    మీ నాన్న గారికి జన్మ దిన శుభాకాంక్షలు. మీరు మీ నాన్నగారి పేరు రాయలేదు. వీలైతే , అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఇక నాకు రెండు విషయాలు అర్ధం కాలేదు.
    “ విగ్రహారధనకు వ్యతిరేకి. రాజయోగ సాధన ద్వారానే మోక్షప్రాప్తి అని చెపారు.”
    వీలైతే ఆయన ఫిలాసఫీ ని వివరించండి. ఇలా అడిగానని ఏమీ అనుకోకపోతే ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకమైనప్పుడు ఆయన సమాధి మందిరం ఆయనే నిర్మించుకోవటం దేనికి? మీరు ఆయన ఫిలాసఫీ నీ చెప్పకపోవటం వల్ల వచ్చిన సందేహం. అలాగే రెండో వాక్యం కూడా వీలైతే వివరించండి.
    దత్తాత్రేయ పీఠం స్థాపించారంటే ఆయన గురు దత్తా సంప్రదాయం లో వుండి వుంటారు. వీలైతే ఆయన బోధనలు, మీరు నమ్మినా , నమ్మకపోయినా అవి ఒక బ్లాగ్ లో వుంచటం వల్ల మీకు నష్టమేమీ వుండదు. నమ్మకం వున్న వారు చదువుకుంటారు. ఈ కామెంట్ మీకేమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు తొలగించవచ్చు. ఈ మెసేజీ మీకు చేరటం వరకే. మీరు చదవటం అయిన తర్వాత దీనికి ఉపయోగం ఏమీ వుండదు.

    రిప్లయితొలగించండి
  8. కల్పనగారూ ఆయన పేరు స్వామి యోగానంద శివయోగి. ఇది ఆయన గురువుగారు పెట్టినది. తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీధరన్.
    కేరళలోని ఆలతూరు, వడగర సిద్ధాశ్రమాల పరంపర ఆయన కొనసాగిస్తున్నారు. సమాధిమందిరాలు వారి ఆచారంగా వున్నాయి. మేం అంటే పిల్లలం ఎవరూ ఆయన మార్గంలో లేకపోవడంతో ముందుగానే నిర్మించుకున్నారు.
    దత్తాత్రేయ పీఠాధిపతి సచ్చిదానంద స్వామి మా వూరు వచ్చినప్పుడు ముందుగా ఈయనను కలిసారు. అప్పటికి ఏ విగ్రహాన్ని ప్రతిష్టించకుండా ధ్యానమందిరంగానే ఉన్నదానిని చూసి దత్తాత్రేయరూపాన్ని వుంచమని ఆయన చెప్పడంతో అలా వుంచారు. ఆయన ఎప్పుడూ ఆరాధన చేయరు. యోగధ్యానం మాత్రమే చేస్తారు. మా అమ్మ ఆరాధిస్తుంది. ఆయనను అందుకోవడం, అర్థంచేసుకోవడం నాకు సాధ్యం కావడంలేదు. మీ సూచనను ఆచరించడానికి ప్రయత్నిస్తాను.

    మీరు firefox వాడుతున్నట్లైతే అందులో ADDons లో pramukhtypepad kaani indic input extension కానీ వుంచితే అన్ని భారతీయ భాషలలో నేరుగా టైప్ చేయొచ్చు, లేఖినిలో అయితే టైప్ చేసి పేస్ట్ చేయాలి. ఆ బాధ వుండదు. F12 use చేసి english కు మారుతుండవచ్చు.

    రిప్లయితొలగించండి
  9. చిలమకూరు విజయమోహన్ గారు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి