18, డిసెంబర్ 2009, శుక్రవారం

సువర్ణ యౌధేయుడు – 2

     ఏళ్ళు గడిచి నేను పదమూడేళ్ళ వాణ్ణయాను. పాఠశాలలో నా చదువు పూర్తికావచ్చింది. నేను మన వేదాలు, ఋఉగ్వేదం, ఐతరేయబ్రాహ్మణం, వ్యాకరణం, నిరుక్తం కొన్ని వాక్యాలూ చదివాను. గురువుగారికి నా మీద అభిమానం ఇంకా పెరుగుతూనే వుంది. ఆయన కూతురు విద్య, నా కంటే నాలుగేళ్ళు చిన్నది. ఆ అమ్మాయికి చదువుకోవడంలో నేను సాయపడేవాణ్ణీ. గురువుగాగ్రూ, గురువుగారి భార్య నా పట్ల వ్యవహరించే తీరువల్ల ఆ అమ్మాయికి నేనంటే ఎంతో గౌరవం ఉండేది. నన్ను “ సువర్ణ అన్నయ్యా” అని అనేది. గురువుగారి కుటుంబం గురించి ఎప్పుడూ చెడుగు చెప్పడానికి నాకేం వుండేది కాదు. ఎంచేతా అంటే గురువుగారి భార్య నన్ను ఎంతో వాత్సల్యంతో తల్లిలాగ చూసేది.

ఆ రోజుల్లో మళ్ళీ నాతోటి విద్యార్థు ల్లో ఒకడు నన్ను ‘ పందెంపుంజూ’ అని వ్యంగ్యంగా అన్నాడు. పోనీ అని ఏదన్నా కారణం ఉందా అంటే  అదీ లేదు. నేను ఏ గొడవా రాకుండా చాలాజాగ్రత్తగా మసలుక్నేవాణ్ణి. చదువులో నేను చాలా చురుగ్గా ఉండటంనుంచి నాతోటి విద్యార్థులకి నేనంటే ఈర్ష్యా అసూయా వుండేవి. అదిగో అదే కారణం తప్ప మరొకటి ఏం కాదు. ఇప్పుడు నా ప్రవృత్తి మారిపోయింది. నేనుగ్ అంభీరంగా ఉంటున్నాను. మనస్సు ఆవేశానికి ఉత్తేజానికి గురి అవటం లేదని కాదు. కాని నేను నెమ్మది నెమ్మదిగా ఆత్మ నిగ్రహాన్ని అలవర్చుకున్నాను. మాతాతగారికి డెబ్బై ఏళ్ళకి పైనే వుంటాయి. ఎన్నోసార్లు ఆయన దగ్గర కూచుని దేశ విదేశాల భోగట్టాలు, యుద్ధం గురించి, శాంతి గురించి ఎన్నెన్నో సంగతులు విన్నాను. ఈ ఊరికి ఆయనే తన సోదరులతో కలిసి మొట్టమొదట వచ్చేరన్న భోగట్టా కూడా నేనువ్ విన్నాను. ఇవాళ తాతగారి దగ్గర మా కులం గురించిన అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఊరికి తూర్పుగా మా మామిడి తోటొకటి  వుంది. మామిడి తోట ముమ్మరంగా కాసింది. ఇంకా పండడానికి  సమయం పడుతుంది. అయినా ఇప్పట్నించే సోనాదాసి అక్కడ తన గుడిసె వేసుకుంది. మaాతాతగారు ఈ ఊరు వచ్చిన వెంటనే నలభై వెండి నాణేలు ఇచ్చి ఎవరో దక్షిణాది వర్తకుడిదగ్గర సోనాని కొన్నారనీ, ఆ రోజుల్లో దక్షిణాది నుంచి దాసదాసీజనాన్ని అమ్మడనికి ఎంతోమంది వ్యాపారస్తులు వస్తూ ఉండేవారని నేనువిన్నాను. సోనా యువతి. అందుకే అంతఖరీదు పెట్టారు. లేకపోతే దాసీవాళ్ళు అంత ప్రియంకాదు. నల్లటి తారులాంటీ సోనా శరీరం మీదచ్ చర్మం ఇప్పుడు వేళ్ళడి పడిపోయింది. ఆవిడ మొహంమీద ముడతలు చంబలuు,బేతబా నదుల వంకర టింకర కాలువల్లా ఉన్నాయి. అయితే యౌవ్వనంలో ఆవిడ అందంగానే ఉండేదని చెప్తారు. తాతగారికి ఆవిడ నెత్తిమీద దేవతే- ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు! దగ్గరవాళ్ళు ఏవేవో అనేవారు. ఆరోగ్యవంతుడూ, భార్య చనిపోయి ఒంటరిగా ఉన్నవాడూ, ప్రౌఢవస్సులోఉన్నవాడూ అలాంటి ఆయనమీద అలాంటి సందేహం కలగటం సహజమే.

సాయంత్రం వేళల్లో తాతగారు తోటకి వెళ్తూఊంటారు. ఓ రోజు నేను ఆయనతో పాటు తోటకి వెల్లాను. తెలివైన మనుమణ్ణని ఆయనకెంతో వాత్సల్యం. అవీ ఇవeీమాట్లాడుతూ నేను ఇలా అన్నాను.

    “ తాతయ్యా! మన కులం గురించి నిజం ఏమిటో నువ్వు చెప్తేవిందామనుకుంటున్నాను. మనల్ని నిజం బ్రాహ్మలని ఎందుకనుకోరూ? ‘ పందెంపుంజు’ అని ఎందుకు వెక్కిరిస్తారు? అమ్మని ఎన్నోసార్లు అడిగాను. కాని తను సరిగ్గ జవాబు చెప్పలేదు”

    “ ఇది అడగాల్సిన అవసరం ఏముందీ?”

    “ చాలా అవసరం తాతయ్యా! అసలు సంగతేమిటో నాకు సరిగ్గా తెలిస్తే మన కులం గురించి చేసే ఆక్షేపణలకి, అవమానాలకి బదులు తీర్చుకోగలుగుతాను. నేనిప్పుడు బ్రాహ్మల గురించి చాలా వరకు చదివేశాను. తాతయ్యా! మనకులం గౌరవాన్ని నిలబెట్టడానికి కావల్సిన జ్ఞానాన్ని, విద్యని నేను సంపాదించాను.”

    “ నువ్వంటున్నది నమ్ముతున్నానురా అబ్బాయీ! కని నీ తల్లికి పాపం మన కులం గురించి అసలు సంగతి తెలీదు. అందుకని ఆవిడ నీకు చెప్పకుండా దాస్తోందని అనుకోకు. లోకంలో ఇప్పుడు నాగరులతో మనకున్న సంబంధ బాంధవ్యాలు మన కులం స్థితిని నిర్ణయిస్తున్నాయి. మనకీ వాళ్ళకీ మధ్య పెళ్ళిళ్ళూ పేరంటాలు ఉన్నాయి. అవంతిలోనూ, లాట్ లోనూ (గుజరాత్) వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. అంచేత వాళ్ళతోపాటే మనమూనూ! మునిగినా తేలినా! మీ తరంవారు నిజానికి యౌధేయులకన్నా నాగరులకిందే లెక్క.”

    “ యౌధేయులంటే తాతయ్యా?”

    “ మన కులం పేరురా అబ్బాయీ! దాన్నించే మనల్ని పందెం పుంజు అంటారు. (యౌధేయ అంతే యుద్ధం చేసేదని అథం)”

    “ యౌధేయులు బ్రాహ్మలా తాతయ్యా ?”

    “ బ్రాహ్మలకన్నా అసలు సిసలయిన ఆర్యులు”

                                (ఇంకావుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి