6, డిసెంబర్ 2009, ఆదివారం

బడుగులకు ప్రత్యామ్నాయం - బౌద్ధం



అనాదిగా సమాజంలో వున్న మూఢత్వాన్ని రూపుమాపేందుకు డా.అంబేద్కర్ ఈ దేశ బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయంగా బౌద్ధాన్ని చూపించారు. ఆనాటి యజ్నయాగాదుల పేరుతో జరుగుతున్న మూఢాచారాలు వ్యతిరేకిస్తూ, స్వయంపాలన కలిగిన సమ సమాజ ప్రతిరూపాలైన గణ రాజ్య వ్యవస్థను కూల్చివేస్తున్న దండయాత్రలకు వ్యతిరేకంగా సిద్దార్థుడు చూపిన ప్రత్యామ్నాయ మార్గం బౌద్ధం. దీనిపై నాటి మతాచార్యులు శంకరాచార్య అద్వైతం పేరుతో మరల వెనకడుగు వేసేలా చేసి, రాజులను గుప్పెట్లో పెట్టుకుని ఈ దేశంలో స్థానం లేకుండా చేసారు. భారత దేశ సమాజాభివృద్ధిలో అత్యధిక శాతంగా వుండాల్సిన దళితులు, బడుగు బలహీన వర్గాల పాత్ర వెనకబడిపోయింది. వారిని అణచబట్టే హిందూ మత కులహంకారం పెరిగి శతాబ్ధాల వెనక్కి జరిగింది. నేటికి వారి పరిస్తితిలో మార్పు రాకపోవడానికి ఇది ఒక కారణం. క్రిస్టియన్ మతాన్ని అంగీకరించిన పాలక వర్గాలు, తమ పునాదులను కుదిపే సమ సమాజ మార్గాన్ని బోధించే బౌద్ధాన్ని దూరంగా వుంచారు. కావున అణగారిన వర్గాలు ఈ దోపిడీ మతాల అసలు రంగును గుర్తించి బౌద్ధాన్ని ఆచరించి తమ ఉన్నతికి కృషిచేయాలి. అంబేద్కర్ వర్థంతి రోజున మరోమారు ఆలోచిద్దాం.

బుద్ధం శరణం గచ్చామి
ధమ్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి