యోగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యోగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, నవంబర్ 2011, మంగళవారం

యోగ - సమాధి- అంతుచిక్కని ప్రశ్న




మా నాన్నగారు తన జీవన విధానంగా ఆచరించి చూపిన యోగ సాధన మాకెవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది..

ఆయన గత నెల ఇరవై ఎనిమిదో తేదీన సాధనలోనే అంతిమ శ్వాశ విడుస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన పార్థివ దేహం ఇరవై గంటల తరువాత కూడా జీవంతో వున్నట్టుగానే రబ్బరులా వుంటూ ఆయన ముందుగా నిర్మించుకున్న సమాధి మందిరం లోనికి ఓ చిన్న దారి గుండా పైనుండి మేమంతా లోపలకి చేర్చినపుడు సుళువుగాచేరుకుంది. ముందుగా పూసిన విభూది పసుపు నీళ్ళ స్నానం చేసాక తొలగినపుడు దేహం కాంతివంతంగానే వుంది. దుర్వాసన అంటూ ఏమీ లేకుండా జీవం ఉట్టిపడింది. సమాధిలో ఆయన ముందుగా వుంచుకున్న సముద్రపు ఇసుక అడుగు మేర వేసి దానిపై మారెడు పత్రి, తులసీ దళాలు వేస్తూ విభూది జల్లి కర్పూరం వేసి ఆ తరువాత దేహాన్ని పరుండబెట్టి విభూది పూసి మరల పత్రాలతో మెడ భాగం వరకు కప్పి సమాధిని గ్రానైట్ పలకతో మూసి వేసాం. మూడో రోజు నుండి పరిసరాలన్నీ తులసీ, కర్పూరం పరిమళాలు ఏడో దినం వరకు వెదజల్లబడ్డాయి. ఇప్పుడు రోజూ మేము లోపల దీపారాధనకు వెళ్ళినప్పుడు పరిమళం ఇంకా వస్తూనే వుంది. ఇదంతా ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. తను బతికినంతకాలం యోగ గురించి తెలుసుకో లేకపోవడం దురదృష్టమే.. సమాధిలో వున్న వారి దేహం అలానే వుంటుందని అది చెడిపోదని తన శిష్యులు పరిచయస్తులు చెప్తున్నారు. అంతా ఓ అంతుచిక్కని ప్రశ్నలా మిగిలింది...