8, నవంబర్ 2011, మంగళవారం

యోగ - సమాధి- అంతుచిక్కని ప్రశ్న
మా నాన్నగారు తన జీవన విధానంగా ఆచరించి చూపిన యోగ సాధన మాకెవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది..

ఆయన గత నెల ఇరవై ఎనిమిదో తేదీన సాధనలోనే అంతిమ శ్వాశ విడుస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన పార్థివ దేహం ఇరవై గంటల తరువాత కూడా జీవంతో వున్నట్టుగానే రబ్బరులా వుంటూ ఆయన ముందుగా నిర్మించుకున్న సమాధి మందిరం లోనికి ఓ చిన్న దారి గుండా పైనుండి మేమంతా లోపలకి చేర్చినపుడు సుళువుగాచేరుకుంది. ముందుగా పూసిన విభూది పసుపు నీళ్ళ స్నానం చేసాక తొలగినపుడు దేహం కాంతివంతంగానే వుంది. దుర్వాసన అంటూ ఏమీ లేకుండా జీవం ఉట్టిపడింది. సమాధిలో ఆయన ముందుగా వుంచుకున్న సముద్రపు ఇసుక అడుగు మేర వేసి దానిపై మారెడు పత్రి, తులసీ దళాలు వేస్తూ విభూది జల్లి కర్పూరం వేసి ఆ తరువాత దేహాన్ని పరుండబెట్టి విభూది పూసి మరల పత్రాలతో మెడ భాగం వరకు కప్పి సమాధిని గ్రానైట్ పలకతో మూసి వేసాం. మూడో రోజు నుండి పరిసరాలన్నీ తులసీ, కర్పూరం పరిమళాలు ఏడో దినం వరకు వెదజల్లబడ్డాయి. ఇప్పుడు రోజూ మేము లోపల దీపారాధనకు వెళ్ళినప్పుడు పరిమళం ఇంకా వస్తూనే వుంది. ఇదంతా ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. తను బతికినంతకాలం యోగ గురించి తెలుసుకో లేకపోవడం దురదృష్టమే.. సమాధిలో వున్న వారి దేహం అలానే వుంటుందని అది చెడిపోదని తన శిష్యులు పరిచయస్తులు చెప్తున్నారు. అంతా ఓ అంతుచిక్కని ప్రశ్నలా మిగిలింది...

7 వ్యాఖ్యలు:

 1. అటువంటి అరుదయిన విద్యలను అలా ఒక్కరికే పరిమితం కానీయకుండా, వారితోనే అంతరించిపోకుండా తరతరాలు పాకేలా మీరే చూడాలి!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎంత గొప్ప నిష్క్రమణం!...ఆయన భౌతికంగా మాత్రమే నిష్క్రమించారు. మనసుల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇటువంటి యోగసూర్యులు మనమధ్యే తిరుగుతూ ఉంటారు.
  కానీ మనమెవరం సరిగా గమనించం.
  అదే మన దురదృష్టం.
  అప్పుషప్పుడూ యితరులు వచ్చి యీ యోగాలు యీ ఆధ్యాత్మికతలూ యీ సమాధిస్థతులూ యీ జ్ఞానసముపార్జనలూ అన్నీ అబధ్ధం అంటూ లెక్చర్లిస్తారు.
  వారికి చూపటానికి మనవద్ద యే నిదర్శనాలూ ఉండవు.
  వారిని కాదనటానికి మనవద్ద యే వాదాలూ ఉండవు.
  వారిని అడ్డుకోవటానికి మనకి సాహసాన్నిచ్చే యే ప్రాతిపదిక మన మనస్సుల్లో ఉండదు.
  ఇష్టం ఉన్నా లేకపోయినా నోరు మూసుకొని ఉంటాం.
  ఇష్టం ఉన్నా లేకపోయినా తలలు ఊపుతాం.
  ఇష్టం ఉన్నా లేకపోయినా మన నిష్క్రియత్వానికి మనమే జవాబుదారీ వహించాలి.
  అందుకే యీ అపురూప విద్యని కాపాడుకుందాం.
  అందుకే యీ అపురూప విద్యని యికనైనా మనఃపూర్వకంగా అభ్యసిద్దాం.
  అందుకే యీ అపురూప విద్యని సగర్వంగా నిలబెడదాం.
  అందరూ ప్రయత్నించండి యధాశక్తి.
  మీ వయస్సు 96 అయినా సరే మొదలు పెట్టవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కేక్యూబ్ వర్మ గారు,
  అటువంటి తండ్రిని కలిగిన మీ అదృష్టానికి అభినందిస్తున్నాను.
  ఆయన వద్దనుంచి మీరేమీ నేర్చుకోనందుకు బాధపడుతున్నాను.
  మీ తండ్రిగారికి నా నమస్సులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీ ఆత్మీయ స్పందనలు తెలియపరచినందుకు బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు....

  ప్రత్యుత్తరంతొలగించు